కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-26T22:46:07+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలకు ఇబ్బంది లేకుండా టోల్ ఫీజులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ నేపధ్యంలో 21 రోజులపాటు భారత్‌లో ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో తాత్కాలికంగా టోట్ ఫీజులను ఆపివేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కాలం మార్చి 25 నుంచి ఏప్రిల్ 15,2020 వరకు టోల్ ఫీజులను వసూలు చేయబోమని కేంద్ర మంత్రి వెల్లడించారు. కర్ఫ్యూ పాసులు ఉన్న వాహనాలకే సిటీ రోడ్లపైకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమైన వాహనాలు అంబులెన్స్‌లు, ఫుడ్, పాలు, మెడిసిన్ సరఫరా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రైవేట్, కమర్షియల్ వాహనాలకు అన్ని సరిహద్దులు, సిటీ రోట్లపైకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-26T22:46:07+05:30 IST