Abn logo
Sep 18 2020 @ 11:42AM

'గమనం'లో నిత్యామీనన్‌ లుక్‌

Kaakateeya

రియల్‌ లైఫ్‌ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'గమనం'. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్‌ లుక్‌ను హీరో శర్వానంద్‌ తన ట్విట్టర్‌ ద్వారా శుక్రవారం విడుదల చేశారు. శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి శ్రియాశరన్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ జ్ఞ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. నిర్మాతగా మారి రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపుతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు. 



Advertisement
Advertisement
Advertisement