Abn logo
Jun 4 2020 @ 18:14PM

నిత్యామీనన్ బరువెత్తలేనందా?

ప్రస్తుతం అన్నీ సినీ ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ఇందులో భాగంగా టాలీవుడ్‌లో మరో క్రీడాకారిణి బయోపిక్ రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్‌లో మహిళా విభాగంలో ఇండియాకు ఫస్ట్ మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత కథను త్వరలో వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. మల్లీశ్వరి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును లేడీ డైరెక్టర్ సంజన రెడ్డి తెరకెక్కించబోతున్నారు. ఈ దర్శకురాలు ఇది వరకు రాజ్ తరుణ్‌తో ‘రాజుగాడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. 


సక్సెస్ ఫెల్యూర్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్  నిత్యామీనన్ కొత్తదనాన్ని పెద్దపీట వేసే ఈ అమ్మడు గత కొంతకాలంగా రేస్‌లో వెనుకబడింది. అయితే వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో నటించేందుకు చిత్ర బృందం మొదట నిత్యామీనన్‌ను అడిగారట. ఈ ప్రాజెక్టు గురించి దర్శకురాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే నిత్యా ఈ ప్రెస్టీజియస్‌కు నో చెప్పిందట. 


Advertisement
Advertisement
Advertisement