Abn logo
Oct 19 2020 @ 12:47PM

నితిన్ కూడా ఇటలీకి..!

Kaakateeya

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణంగా మారుతున్నాయి. ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు షూటింగ్‌లకు హాజరవుతున్నారు. కొందరు హీరోలు షూటింగ్‌ల కోసం విదేశాలకు కూడా పయనమవుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` కోసం ఇప్పటికే ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. 


ప్రభాస్ బాటలోనే యంగ్ హీరో నితిన్ కూడా ఇటలీ పయనమవుతున్నాడట. నితిన్, కీర్తీ సురేష్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం `రంగ్ దే`. ఈ సినిమాలోని రెండు రొమాంటిక్ సాంగ్స్ కోసం చిత్ర యూనిట్ ఈ నెల 25న ఇటలీ పయనమవుతోందట. ఆ రెండు పాటలతో షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 


Advertisement
Advertisement