Abn logo
Mar 29 2020 @ 21:36PM

నితిన్‌ను యుద్ధ వీరుడితో పోల్చిన చిరంజీవి

యంగ్ హీరో నితిన్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్‌తో పాటు పెళ్లిని వాయిదా వేసుకున్న నితిన్‌ను ప్రశంసించారు. ‘‘వ్యక్తిగత జీవితం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనుకున్నమీ ఆలోచన చాలా మంచిది. కరోనా నియంత్రణకు మీరు యుద్ధ వీరుడిలా పోరాటం చేస్తున్నారు. మీకు, మీకు కాబోయే భార్య షాలినికి కూడా శుభాకాంక్షలు.’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement