‘భీష్మ’ షూటింగ్ పూర్తి

నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ‘భీష్మ‌’. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల‌ను నితిన్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ‘‘భీష్మ చివరిరోజు షూటింగ్ పూర్తయ్యింది. నాకెంతో బాధగా ఉంది. ఇలాంటి మంచి ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ చేసినందుకు గ‌ర్వంగా..సంతోషంగా ఉంది. వెంకీ కుడుముల ల‌వ్ యూ. నీ గురించి చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. భీష్మ చిత్రాన్ని నాతో చేసినందుకు థాంక్స్‌. నీతో మ‌రోసారి ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నాను. త్వ‌ర‌లోనే ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం మేమంద‌రం క‌లిసి ప‌నిచేస్తాం’’ అన్నారు.

 

నితిన్ పోస్ట్‌పై ర‌ష్మిక స్పందిస్తూ ‘‘షూటింగ్ ఈరోజుతో పూర్త‌య్యింద‌టే న‌మ్మ‌లేక‌పోతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. నీతో క‌లిసి ఈ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత‌కంటే గొప్ప‌గా చెప్ప‌లేక‌పోతున్నందుకు న‌న్ను మ‌న్నించు. కానీ ..నేను ఏమంటున్నానో నీకు తెలుసు’’ అన్నారు.

Advertisement