నిర్వాసితులకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-01-25T06:32:21+05:30 IST

నిర్వాసితులకు అండగా ఉంటా

నిర్వాసితులకు అండగా ఉంటా
రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీ

గన్నవరం, జనవరి 24 : ఎయిర్‌పోర్టు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. నిర్వాసితులందరికీ మేలు చేసేందుకు మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన దావాజీగూడెం, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లోని 423 మందికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ ద్వారా ఐదు సెంట్లు చొప్పున స్థలం కేటాయించారు. దానికి సంబంధించి లబ్ధిదారులకు స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించి దస్తావేజులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి అందజేయటం జరుగుతుం దన్నారు. మౌలిక వసతుల కల్పనకు కూడా తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించగా పనులు జరుగుతు న్నాయన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్వయంగా వెళ్లి నిర్వాసితుల సమస్యలు వివరించినట్లు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే ఇళ్ల స్థలాలు, నష్ట పరిహారం మం జూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో రోజుకి 15మందికి చొప్పున రిజిస్ర్టేషన్‌ చేసి దస్తావేజులు అందజేయనున్నట్లు తెలి పారు. రిజిస్ర్టార్‌ వెంకటేశ్వరరావు, ఎంపీపీ అనగాని రవి, జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్‌ రాణి, తహసీ ల్దార్‌ నరసింహారావు, సర్పంచ్‌లు డొక్కు సాంబశివ వెంకన్న బాబు, బడుగు బాలమ్మ, నిడమర్తి సౌజన్య, గోగు లమూడి విజయలక్ష్మి, చేబ్రోలు మౌనిక, మాజీ వైఎస్‌ ఎంపీపీ గొంది పరంధామయ్య, రాణి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:32:21+05:30 IST