Abn logo
Sep 25 2021 @ 23:20PM

లక్ష్మీపురం రహదారికి మోక్షం

నిధులు మంజూరైంది ఈ రహదారికే..

పక్కా రోడ్డు నిర్మాణానికి రూ.కోటి మంజూరు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

పెందుర్తి రూరల్‌, సెప్టెంబరు 25: జీవీఎంసీ 95వ వార్డు పరిధి లక్ష్మీపురం కూడలి నుంచి పాపయ్యరాజుపాలెం వెళ్లే రహదారికి ఎట్టకేల కు మోక్షం కలిగింది. సుమారు కిలో మీటరు పరిధిలో అధ్వానంగా ఉన్న ఈ రహదారిలో తారు రోడ్డు నిర్మాణానికి రూ.కోటి నిధులు కేటాయించ డానికి జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. సుమారు 14 కాలనీల ప్రజలు ఈ రహదారిని విని యోగిస్తుంటారు. కిలో మీటరు వరకు మట్టి రోడ్డుగా మిగిలిపోవడం, వర్షాలకు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రహదారి దుస్థితిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావ డంతో స్థానిక కార్పొరేటర్‌ ముమ్మన దేముడు స్పందించారు. రహదారి సమస్యను జీవీ ఎంసీ పాలకవర్గ సమావేశంలో ప్రస్తావించి దీనికి సంబంధించిన ఫొటోలను అధికారులకు అందజేశారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారితో పాటు స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కూడా స్పందించడంతో పక్కా రహదారి నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూ రు చేస్తూ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను ప్రారంభిస్తామని కార్పొరేటర్‌ ముమ్మన దేముడు తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన మేయర్‌, కమిషనర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు కృతజతలు తెలిపారు.