నామమాత్రంగా ఉద్యోగాల భర్తీ : ఏబీవీపీ

ABN , First Publish Date - 2021-06-20T03:13:25+05:30 IST

రాష్ట్రంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం 10,143 ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం సిగ్గుచేటని ఏబీవీపీ

నామమాత్రంగా ఉద్యోగాల భర్తీ  : ఏబీవీపీ
మావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌19: రాష్ట్రంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం 10,143 ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం సిగ్గుచేటని ఏబీవీపీ బుచ్చి మండల శాఖ అధ్యక్షుడు గోదిన వంశీ అన్నారు. శనివారం బుచ్చిలోని అపస్‌ కార్యాలయంలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో చెప్పిన హామీని గాలికొదిలేసి కొద్ది పోస్టులు మాత్రమే విడదల చేయడం సరికాదన్నారు. ఏపీపీఎస్‌సీ క్యాలెండర్‌లో మొత్తం ఉద్యోగాలను భర్తీచేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు కాసా వెంకట అఖిల్‌, ఎస్‌. బాలాజి, ఆర్‌, కేతన్‌, విగ్నేష్‌, కాలేషా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T03:13:25+05:30 IST