మాంద్యం ముప్పు లేదు

ABN , First Publish Date - 2022-08-02T09:00:00+05:30 IST

మన దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయ సంస్థల అంచనా మేరకు మన దేశం చాలా వేగంగా...

మాంద్యం ముప్పు లేదు

వేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి..

చాలా దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: నిర్మల 

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మన దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయ సంస్థల అంచనా మేరకు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బ్లూంబెర్గ్‌ సర్వే కూడా భారత్‌ మాంద్యంలోకి వెళ్లేందుకు అవకాశాలు శూన్యమని పేర్కొందన్నారు. చాలా దేశాలకంటే మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందన్నారు. ధరల పెరుగుదలపై సోమవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇది వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయంగా జరుగుతున్న చ ర్చ. ఈరోజు సుమారు 30 మంది ఎంపీలు మాట్లాడా రు.


వారంతా రాజకీయ కోణంలోనే మాట్లాడారు’ అన్నా రు. ఈ ఏడాది జూలై నెలకు 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని చెప్పారు. వరుసగా ఐదో నెలలో జీఎస్టీ వసూళ్లు 1.4 లక్షల కోట్లకు మించి వచ్చాయన్నారు. రి టైల్‌ ద్రవ్యోల్బణాన్ని 7శాతం కంటే తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం తొమ్మిది సార్లు రెండంకెలకు చేరిందని విమర్శించారు. మంత్రి సమాధానంతో సం తృప్తి చెందని కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. 


ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది

లోక్‌సభలో ధరల పెరుగుదలపై చర్చను కాంగ్రెస్‌ స భ్యుడు మనీశ్‌ తివారీ ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని ఆయన నిందించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే దేశంలోని 25 కోట్ల కుటుంబాలు కష్టాలు అనుభవిస్తున్నాయని ఆక్షేపించారు. ధనికులు, పేదల మధ్య అంత రం మరింత పెరిగింద న్నారు. ‘ఉపాధి, పొదుపు, పెట్టుబడులు, ఉత్పత్తి, వినియోగం అనేవి ఆర్థికవ్యవస్థకు ఐదు స్తంభాలు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల ఆ స్తంభాలు ఊడిపోయాయి. యూపీఏ పాలనలో 27 కోట్ల మందిని దారిద్య్ర రేఖ నుంచి పైకి తీసుకొ చ్చాం.


ఇప్పుడు మళ్లీ 23 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు చేరారు. దేశంలో పేదల ఆదాయం రోజురోజుకూ తగ్గిపోతోంది. బిలియనీర్ల సంఖ్య మాత్రం వంద నుంచి 142కు పెరిగింది. దేశ సంపదలో 77శాతం.. ఒక శాతం జనాభా చేతిలో ఉండటం దురదృష్టకరం. దేశంలోని 92 మంది అత్యంత ధనికుల సంపద 55కోట్ల మంది సంపదతో సమానంగా ఉంది. 2016లో పెద్దనోట్లు రద్దుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం మొదలైంది. తర్వా త జీఎస్టీ అమలుతో 2.30 లక్షల చిన్న పరిశ్రమలు దె బ్బతిన్నాయి. దేశంలో ప్రస్తుతం 40 కోట్లమందికి మాత్ర మే ఉద్యోగాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశంగా మా రాలంటే 84 కోట్ల మందికి ఉద్యోగాలు ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం వద్ద అలాంటి వ్యూహాలేమీ లేవు. పిండి, పెరుగు, పన్నీరు, పెన్సిళ్లపై కూడా జీఎస్టీ పెంచేశారు. పిల్లల్ని కూడా వదల్లేదు. శ్మశానవాటికలపైనా 18 శాతం జీఎస్టీ విధించారు. ఇంధనం నుంచే పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీ, డివిడెండ్ల రూపంలో రూ.27 లక్షల కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. 25 కోట్ల కుటుంబాలను నాశనం చేశారు. ప్రతి గృహిణీ కళ్లలోనూ కన్నీరే’ అన్నా రు. వంటగ్యాస్‌ ధర చాలా ఎక్కువగా ఉందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ దస్తిదార్‌ సభలోకి వంకాయ తీసుకొచ్చి నిరసన తెలిపారు. 


అట్టుడికిన రాజ్యసభ

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్టు సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారం అట్టుడికింది. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పోడి యం వద్దకు దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. సభాకార్యక్రమాలను సజావుగా సాగనివ్వాలని సభాధ్య క్ష స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కలిత కోరినప్పటికీ స భ్యులు శాంతించలేదు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా సభను సజావుగా సాగనివ్వాలని ప్రతిపక్షాలను కోరారు. 


సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

నలుగురు కాంగ్రెస్‌ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం ఎత్తివేశారు. సభలోకి ప్లకార్డులు తీసుకురాబోమని వారు హామీ ఇవ్వాలని అంతకుముందు ప్రతిపక్షాలను ఆయన కోరారు. సభా నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నలుగురిపై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో సభాకార్యక్రమాలు సోమవారం సజావుగా కొనసాగాయి. ధరల పెరుగుదల, మరిన్ని వస్తువులపై జీఎస్టీ అమలు, అగ్నిపథ్‌ తదితర అంశాలపై చర్చ జరపాలంటూ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపచేస్తున్న విష యం తెలిసిందే.


లోక్‌సభలో నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించినందుకు మాణిక్యం ఠాగూర్‌, రమ్య హరిదాస్‌, టీఎన్‌ ప్రతాపన్‌, ఎస్‌.జోతిమణిలను గత సోమవారం స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని అప్పుడు ప్రకటించారు. దీంతో  ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీల ఫ్లోర్‌లీడర్ల్‌తో స్పీకర్‌ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2022-08-02T09:00:00+05:30 IST