పీఎస్‌బీలతో 23 న సమావేశం కానున్న నిర్మాలా సీతారామన్

ABN , First Publish Date - 2022-04-10T23:17:25+05:30 IST

రుణదాతల పనితీరును సమీక్షించే క్రమంలో ఆర్ధిక శాఖా మంత్రి సీతారామన్ ఈ నెల 23 న పీఎస్‌బీల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం(2022-23) బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఇది మొదటి పూర్తి సమీక్ష సమావేశం కానుంది.

పీఎస్‌బీలతో 23 న సమావేశం కానున్న నిర్మాలా సీతారామన్

న్యూఢిల్లీ : రుణదాతల పనితీరును సమీక్షించే క్రమంలో ఆర్ధిక శాఖా మంత్రి  సీతారామన్ ఈ నెల 23 న పీఎస్‌బీల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం(2022-23) బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఇది మొదటి పూర్తి సమీక్ష సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై రుణదాతల పనితీరు, సాధించిన పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23 న ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతులతో సమావేశం కానున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను నిర్మలా సీతారామన్ ఇప్పటికే కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్) సహా ఆయా విభాగాలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమగ్ర సమీక్ష జరగనుంది. 

Updated Date - 2022-04-10T23:17:25+05:30 IST