ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజ్.. ఐదో విడత వివరాలు

ABN , First Publish Date - 2020-05-17T21:11:43+05:30 IST

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద ఐదో విడత వివరాలను కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజ్.. ఐదో విడత వివరాలు

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద ఐదో విడత వివరాలను కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అన్ని రకాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని తెలిపారు. ఆర్థికరంగంలో కీలక రంగాలు మొదలుకానున్నాయని, వలస కార్మికులను ఆదుకోవడం దాకా అన్ని కోణాలను స్పృశించామన్నారు. లాక్‌డౌన్‌ ప్రటించకగానే గరీబ్‌ కల్యాణ్‌ యోజనను తక్షణం అమలు చేయాలన్నారు. పేదలకు మూడు నెలలు సరిపడా ఆహార ధాన్యాలు చేరవేశారన్నారు. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా... పేదలకు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశామని తెలిపారు. 8.9కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున పడ్డాయన్నారు. జన్‌ధన్‌ ఖాతాలున్న 20కోట్ల మందికి నేరుగా నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణరంగంలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు...రూ.4వేల కోట్లు నేరుగా అందించామని తెలిపారు. పేదలు, కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అన్నారు.  


ప్యాకేజీలోని ముఖ్యాంశాలు...


* నిర్మల తొలి విడతలో రూ.5,94,550 కోట్లు కాగా, రెండో విడదలో రూ. 3 లక్షల 10 వేల కోట్లు, మూడో విడతలో రూ. లక్షా 50 వేల కోట్లు, నాలుగు, ఐదు విడతలలో రూ.48,100 కోట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన మొత్తం రూ.11,02,650 కోట్లుకాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి వచ్చిన ప్రకటనలు రూ.801,603 కోట్లు. 

* ల్యాండ్‌, లేబర్‌, లిక్విడిటీ, లా మా ప్రధానాంశాలు

* 8.1 కోట్ల మంది కార్మికులకు కిసాన్‌ యోజన కింద రూ.16,394కోట్ల నగదు

* జన్‌ధన్‌ యోజన కింద రూ.10,025 కోట్లు నేరుగా ఖాతాల్లోకి వేశాం

* నిర్మాణ రంగ కార్మికులకు రూ.3,950కోట్లు: కేంద్రమంత్రి నిర్మల

* వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును భరిస్తున్నాం: నిర్మల

* ఐదో విడతలో ఏడు అంశాలకు సంబంధించి ప్యాకేజీ ప్రకటన

* ఉపాధి హామీ, వైద్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యం

* డీక్రిమినలైజేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌...

* పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు

* కరోనా నియంత్రణకు రాష్ట్రాలకు రూ.4100కోట్లు కేటాయింపు

* టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్‌ల కోసం రూ.550కోట్లు

* వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా

* నిత్యావసర వస్తువుల కోసం రూ.3,750 కోట్లు

* విద్యావిధానంలో టెక్నాలజీతో సమూల మార్పులు తీసుకొస్తున్నాం

* వీడియో ఇంటరాక్టివ్‌ టెక్నాలజీతో విద్యార్థులకు క్లాసులు చెప్పేందుకు...

ఇప్పటికే మూడు కొత్త చానెళ్లు రూపొందించాం

* మరో 18 చానెళ్లు సిద్ధంగా ఉన్నాయి

* స్కైప్‌తో పాటు టాటాస్కై, ఎయిర్‌టెల్‌ లాంటి చానెళ్ల ద్వారా...

ఈ వీడియో కాన్ఫరెన్స్‌ టెక్నాలజీ విద్యార్థుల ఇళ్లకు చేరుతుంది

* ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య టెక్నాలజీ వారధిలా...

వినూత్న బోధనా విధానానికి ప్రయత్నిస్తున్నాం

* ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కంపెనీల చట్టంలో మార్పులు

* యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్యలు

* కార్పొరేట్‌రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహకాలు

* బోర్డు మీటింగ్‌లను వర్చువల్‌గా నిర్వహించుకోవచ్చు

* గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం రూ.40వేల కోట్లు అదనంగా కేటాయిస్తున్నాం

* స్కూళ్లలో డిజిటలైజేషన్‌కు అనుమతి: కేంద్రమంత్రి నిర్మల

* స్వయం ప్రభ డీటీహెచ్‌ సేవల ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు

* ప్రతి రోజు 4గంటల పాటు ఆన్‌లైన్‌ క్లాసులు

* ఈ-స్కూల్‌లో 200 కొత్త పుస్తకాలు

* కొత్తగా 12 ఈ-విద్య ఆన్‌లైన్‌ చానెల్స్

* కొత్తగా పీఎం ఈ-విద్య

* 1-12 తరగతుల వరకు ఈ-విద్య కోసం ప్రత్యేకంగా ఒక్కో చానెల్‌

* బధిరుల కోసం ప్రత్యేక ఈ-క్లాస్‌లు

* ఆన్‌లైన్‌ కోర్సుల అమలుకు 100 వర్సిటీలకు అనుమతి

* మనో దర్పణ్‌ స్కీమ్‌ ద్వారా విద్యార్థులకు, టీచర్లకు కౌన్సెలింగ్


Updated Date - 2020-05-17T21:11:43+05:30 IST