మందగమనం ప్రస్తావనేదీ?

ABN , First Publish Date - 2020-02-18T09:22:17+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగించిందని ప్రధానమంత్రి ఆర్థిక

మందగమనం ప్రస్తావనేదీ?

  • బడ్జెట్‌లో దార్శనికత లేదు
  • ప్రధాని ఆర్థిక సలహామండలి 
  • సభ్యురాలు అషిమా ఆక్షేపణ


ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగించిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాత్కాలిక (పార్ట్‌టైమ్‌) సభ్యురాలు అషిమా గోయల్‌ అన్నారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని తగ్గించడం, ఆదాయ పన్ను చెల్లింపును సరళీకరించడం వంటి సానుకూలతలు ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో దార్శనికత లోపించిందని అన్నారు. కొత్త ప్రభుత్వ మొదటి అసలైన బడ్జెట్‌గా తమ విజనేంటో చెప్పలేదు. మొత్తంగా ఇది నిరాశపరచింది. అయితే తన చర్యల ద్వారా నిర్మల సమతూకం సాధించారు. 

Updated Date - 2020-02-18T09:22:17+05:30 IST