TS News: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం..

ABN , First Publish Date - 2022-09-02T20:58:26+05:30 IST

బీర్కూర్ రేషన్ షాపు (Ration Shop)ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తనిఖీ చేశారు.

TS News: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం..

కామారెడ్డి జిల్లా (Kamareddy District): బీర్కూర్ రేషన్ షాపు (Ration Shop)ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకుల పంపిణీ తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ ఫ్లెక్సీ (Modi flexi) ఎందుకు లేదని జిల్లా కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు. పేద ప్రజల కోసం చేసే కార్యక్రమంలో మోదీ ఫ్లెక్సీ లేకపోవడంపై కలెక్టర్‌పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ పెట్టడానికి అధికారులు వస్తే.. వాళ్లపై టీఆర్ఎస్ కార్యకర్తలు గంతులేయడం, ఫ్లెక్సీలు చింపేయడం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇక నుంచి ఇలా జరగడానికి వీల్లేదని, ప్రతి రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీ ఉంటుందని వాటిని చూసే బాధ్యత జిల్లా కలెక్టర్లేదేని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపుల్లో ప్రధాని ఫ్లెక్సీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-02T20:58:26+05:30 IST