కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-03-26T19:16:53+05:30 IST

కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ

కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ ప్యాకేజీ

న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్‌తో కలిసి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వచ్చే మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తామన్నారు. 

Updated Date - 2020-03-26T19:16:53+05:30 IST