నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొన్నాళ్ళుగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు అనిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. తమ ఇంటి వద్ద మళ్లీ కనిపించడంతో అనిల్‌ను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అనిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.