నిర్మల్‌లో యువకుడు అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-09-14T15:14:02+05:30 IST

జిల్లాలోని కుభీర్ మండలం దోడర్న తండా-4 గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

నిర్మల్‌లో యువకుడు అనుమానాస్పద మృతి

నిర్మల్: జిల్లాలోని కుభీర్ మండలం దోడర్న తండా-4 గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో  మృతి చెందాడు. నల్గొండ ప్రాంతానికి చెందిన ఓ యువతిని గర్భవతిని చేసినట్టు రాజేందర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 21న పెద్దలు పెళ్లికి ఒప్పించగా... ఇంతలోనే పంట చేనులో  రాజేందర్ తీవ్ర గాయాలతో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-14T15:14:02+05:30 IST