బాసర నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-07-22T17:18:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుతున్నాయి. వర్షాలు భారీగా పడుతుండటంతో బాసర

బాసర నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుతున్నాయి. వర్షాలు భారీగా పడుతుండటంతో బాసర వద్ద గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జాలర్లు, భక్తులు, నది పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పలుచోట్ల మండల్లాలోని రవీంద్రపూర్, మైలాపూర్, కౌట గ్రామాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-07-22T17:18:10+05:30 IST