నిర్మల్: గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో భైంసాలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఆటోనగర్‌లోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటితో మహాగాం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గుండెగాం చుట్టూ వరద చేరింది.
కాగా... గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈరోజు ఉదయం అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి 39,726 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 31,920 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 అడుగులు కాగా, ప్రస్తుతం 358.7అడుగులుగా ఉంది.