నిర్మల్‌లో TRS నేత అరాచకం..

ABN , First Publish Date - 2022-02-27T18:54:07+05:30 IST

నిర్మల్‌లో దారుణం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ సాజిద్ ఖాన్ బరితెగించారు.

నిర్మల్‌లో TRS నేత అరాచకం..

నిర్మల్‌లో దారుణం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ సాజిద్ ఖాన్ బరితెగించారు. అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ కాలనీకి చెందిన బాలికపై కొన్నాళ్ల క్రితం సాజిద్ ఖాన్ కన్నుపడింది. ఆమెను భయపెట్టి లోబర్చుకున్నాడు. తన మాట వినకుండే చంపేస్తానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు విసిగిపోయిన బాలిక నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సాజిద్ ఖాన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను పలు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. న్యాయ విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ లాంటి ఘటనలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-02-27T18:54:07+05:30 IST