Basaraలో నాలుగో రోజుకు చేరిన Students ఆందోళన

ABN , First Publish Date - 2022-06-17T17:59:01+05:30 IST

Nirmal జిల్లా: ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు.

Basaraలో నాలుగో రోజుకు చేరిన Students ఆందోళన

Nirmal జిల్లా: ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల (Students) నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కాగా విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandy Sanjay) బాసర వస్తున్నారనే సమాచారంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడినల్ ఎస్పీ, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 2వందల మంది కానిస్టేబుళ్లు మోహరించారు. అన్ని రహదారుల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్‌కు క్యాంపులోని విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులు అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. నిజామాబాద్-భైంసా (Nizamabad-Bhainsa) రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్-భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.

Updated Date - 2022-06-17T17:59:01+05:30 IST