భైంసాలో భారీగా మోహరించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-03-08T13:31:35+05:30 IST

భైంసాలో మరోసారి ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు భారీగా మోహరించారు. 600 మంది పోలీసులతో భైంసాలో బందోబస్తు నిర్వహించారు.

భైంసాలో భారీగా మోహరించిన పోలీసులు

నిర్మల్: భైంసాలో మరోసారి ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు భారీగా మోహరించారు. 600 మంది పోలీసులతో భైంసాలో  బందోబస్తు నిర్వహించారు. దాదాపు 50 మంది ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు 100 మంది అనుమానితులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రజలు  సహకరించాలని ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ కోరారు.


అల్లరి మూకల స్వైర విహారంతో భైంసా ఉలిక్కిపడింది. రాళ్ళ దాడితో అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో ఎస్ఐ, కానిస్టేబుల్, ముగ్గురు రిపోర్టర్లు సహా 12మందికి గాయాలయ్యాయి. పలు వాహనాలు, దుకాణాలు దగ్ధమయ్యాయి. పోలీసుల అప్రమత్తతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జుల్ఫీకర్ గల్లి, గణేశ్ నగర్, కుబీర్ రోడ్, బస్టాండ్ ఏరియా, కొర్భా గల్లి, మేదరి గల్లి ప్రాంతాల్లో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోంది. అలాగే భైంసాలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. 

Updated Date - 2021-03-08T13:31:35+05:30 IST