Basar IIITలో మళ్లీ 18 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-05T00:29:07+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో లో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు అయినట్లు..

Basar IIITలో మళ్లీ 18 మంది విద్యార్థులకు అస్వస్థత

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో (Basara IIIT College) 18 మంది విద్యార్థులు (Students అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు అయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ క్యాంపస్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కొట్టి పారేశారు. 


అటు వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. సీజనల్ వ్యాధులతోనే విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని...ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు.


ఇటీవల కూడా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగాయి. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతోందని.. హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ చర్చలతో ఈ ఆందోళనను  విద్యార్థులు విరమించారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2022-08-05T00:29:07+05:30 IST