Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 07:20:28 IST

మారనున్న నిర్మల్ రూపురేఖలు

twitter-iconwatsapp-iconfb-icon
మారనున్న నిర్మల్ రూపురేఖలు

త్వరలో రింగురోడ్డు

ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ప్రతిపాదనలు

నిర్మల్‌ చుట్టూరా డబుల్‌ లైన్‌ రోడ్డు

నాలుగు వైపుల టౌన్‌కు అనుసంధానం

నిర్మల్‌: జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా మళ్లీఆశలు మొదలవుతున్నాయి. కాగా జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడం, అలాగే సమీప గ్రామాలు ప ట్టణానికి క్రమంగా చేరువవుతుండడంతో దీనివిస్తీర్ణం దాదాపు 35 కిలోమీటర్ల వరకు చేరుకోబోతుంది. తూర్పువైపు నుండి పడమర వైపుకు పడమర వైపు నుంచి తూర్పువైపుకు ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ప్రస్తుతం నిర్మల్‌ పట్టణం మీదుగానే వెళ్లాల్సి వస్తుంది. దీంతో దూర భారం, అధికసమయం లాంటివి జనాలకు తీవ్రఇబ్బందులు కలిగిస్తోంది. అలాగే ట్రాఫిక్‌సమస్య కూడా ఏర్పడుతుంది. దీనితో గ్రామీణ ప్రాంత వాసులు వ్యయ, ప్రయాసల కోర్చి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి కలుగుతుందని పేర్కొంటున్నారు.


జిల్లాకేంద్రంగా ఏర్పడిన నాటి నుండి నిర్మల్‌ పట్టణానికి చుట్టూ గ్రామాల జనసంచారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల రాకపోకలు పెరిగిపోవడంతో నిర్మల్‌ ప్రతిరోజూ కిటకిటలాడుతోంది. ఇలాంటి  నేపథ్యంలో అధికారులు నిర్మల్‌ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గించేందు కోసం ప్రత్యే కంగా రింగ్‌రోడ్డు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. నిర్మల్‌ చుట్టూరా 35 కిలోమీటర్ల మేరకు ఈ రింగ్‌రోడ్డు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికోసం గాను 35 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగులైన్ల రోడ్డను నిర్మించాలని భావిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూపొందిం చిన ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతి పాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు విడుదల చేసినట్లయితే ఇక నిర్మల్‌ చుట్టూరా ఉన్న దూరప్రాంతపు ప్రజలందరికీ నిర్మల్‌ టౌన్‌కు చేరుకునేందుకు ఎంతో సులువవుతుంది. అలాగే కమ్యూనికేషన్‌ వ్యవస్థ మరింత విస్తరించేందుకు రింగ్‌రోడ్డు దోహదపడుతుందంటున్నారు. 


నాలుగు వైపుల నిర్మాణ ప్రతిపాదనలు

నిర్మల్‌ చుట్టూరా ఉన్న అన్ని గ్రామాలను కలుపుతూ నాలుగు వైపుల ఈ రింగ్‌రోడ్డును నిర్మించాలని తలపెట్టారు. రాణాపూర్‌ నుండి మొదలు కుని ఎల్లారెడ్డిపేట, పులిమడుగు, నీలాయిపేట, కిషన్‌రావుపేట, న్యూ పోచంపాడ్‌ మీదుగా అక్కాపూర్‌, కడ్తాల్‌, కౌట్ల(కే), చిట్యాల వరకు ఈ రోడ్డును చేపట్టనున్నారు. అలాగే ఇక్కడి నుండి మళ్లీ లంగ్డాపూర్‌, తల్వేద, ఆలూర్‌, లక్ష్మీపూర్‌ మీదుగా రాణాపూర్‌ వరకు ఈ రింగ్‌ రోడ్డును ప్రతి పాదిస్తున్నారు. ఈ రింగ్‌ రోడ్డుకు పులిమడుగు నుండి కడ్తాల్‌ వరకు నేషనల్‌ హైవే నంబర్‌ 44కు లింక్‌ చేయాలని భావిస్తున్నారు. అలాగే వాంకిడి నుండి కడ్తాల్‌ వరకు కూడా ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. అలాగే నిర్మల్‌ గుండా వెళ్లే మూడు హైవేలను కూడా ఈ రింగ్‌ రోడ్డుతో లింక్‌ చేయాలని ప్రతిపాదించారు.


ప్రతిపాదనలు పంపాం..

రింగ్‌రోడ్డు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వా నికి పంపాం. సాంకేతిక కారణాలతో పాటు మరికొన్ని కారణాల వల్ల రింగ్‌రోడ్డు నిర్మాణంపై స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా భూసేకరణ ప్రధానసమస్యగా మారే అవకాశముంది. అయితే నిర్మల్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమశాఖ పరిధిలో ఉన్న కడ్తాల్‌ టు మహబూబ్‌ఘాట్‌ వరకు గల రోడ్డును త్వరలో నిర్మల్‌ మున్సిపాలిటీకి అప్పజెప్పనున్నట్లు తెలి పారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నిర్మల్‌ మున్సిపల్‌ యంత్రాంగం చూసుకుంటుందని ఆయన వివరించారు. 

- అశోక్‌కుమార్‌, ఈఈ, ఆర్‌అండ్‌బీ, నిర్మల్‌


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.