నిర్మల్: జిల్లాలోని భైంసా మండలం పాంగ్రి పరిసరాల్లో రెండు సింహాలు సంచరిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సింహాల సంచారంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఎలాంటి వదంతలు నమ్మవద్దని ప్రజలకు అటవీశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.