నిర్మల్: జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఒక్క గేటు ఎత్తివేసి.. 5272 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా...ప్రస్తుతం 1180 అడుగులకు చేరింది.