ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం : సీపీఎం

ABN , First Publish Date - 2020-12-01T04:26:16+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం : సీపీఎం

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం : సీపీఎం
దస్తగిరిపేట్‌లో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

తాండూరు రూరల్‌ :  ధాన్యంకొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని, వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లాకార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  అంతారం, దస్తగిరిపేట్‌ గ్రామాల్లో పర్యటించి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రైతులు పండించిన వరి, పత్తి పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా రైతువ్యతిరేక  చట్టాలను తీసుకొస్తూ అప్పుల పాలుచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆర్డీవో, డీసీఎంఎస్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోమహేష్‌, స్వామిదాస్‌, ఆనంద్‌,  రైతులు వెంకటయ్య, బాలమణి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-01T04:26:16+05:30 IST