నిర్మల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.