ప్ర‌భుత్వ‌మే పండుగ‌లు చేసే గొప్ప సంస్కృతి తెలంగాణ‌కే సొంతం: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-27T20:33:49+05:30 IST

రంజాన్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ‌మే పండుగ‌లు చేసే గొప్ప సంస్కృతి తెలంగాణ‌కే సొంతం: ఎర్రబెల్లి

తొర్రూరు: రంజాన్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి అనంతరం ప్రభుత్వం అందచేస్తున్న నూతన వస్ర్తాలను ముస్లిం లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ముస్లిం లు కలిసిమెలసి జీవించే సంస్క`తి మనదని అన్నారు. కానీ కొందరు బీజేపీ మతోన్మాదులు హిందూ ముస్లిం ల మధ్య వైషమ్యాలను రెచ్చ గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్ర‌తి ఏటా అన్ని మ‌తాల పండుగ‌ల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించే గొప్ప సంస్కృతిని సీఎం కేసిఆర్ ప్ర‌వేశ పెట్టార‌ని, ఆ విధంగా బ‌తుక‌మ్మ‌, రంజాన్‌, క్రిస్మ‌స్ పండుగ‌ల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్త‌న్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. 


ఈ సంస్కృతి ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని ఆ ఘ‌న‌త సిఎం కేసిఆర్ కే ద‌గ్గుతుంద‌ని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలన్నారు.సీఎం కేసిఆర్ తరచూ చెప్పే, తెలంగాణకే తల మానికమైన "గంగజమునా తెహజీబ్ " మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కెసిఆర్ మొదలు పెట్టారన్నారు. ఆవిధంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి మందికి బ‌ట్ట‌లు పంపిణీ చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి 2008 నుండి 2014 మద్యకాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు నాలుగున్నర లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-27T20:33:49+05:30 IST