న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీ ముండ్కా వాణిజ్యభవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరో 19 మంది గల్లంతు అయ్యారు.మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ అధికారులు మృతదేహాల భాగాలకు డీఎన్ఏ పరీక్షలు చేశారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో కంపెనీ యజమానులైన వరుణ్ గోయల్, సతీష్ గోయల్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.Delhi Mundka fire అయిన భవనానికి అగ్నిమాపకశాఖ ఎన్ఓసీ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. భవనం పై అంతస్తులో ఉన్న మనీష్ లక్రా పరారీలో ఉన్నాడు.
మంటల నుంచి బయటపడేందుకు పలువురు పై నుంచి దూకిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగాయి. అగ్ని ప్రమాద సమయంలో బయటకు వెళ్లే అత్యవసర మార్గం మూసి ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు అంచనా. గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.శుక్రవారం రాత్రి ఘటనా స్థలిని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, అగ్నిమాపక విభాగం ఉన్నతాధికారులు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి