న్యూయార్క్: అమెరికా దేశం న్యూయార్క్ నగరంలోని అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా 19 మంది మరణించారు. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదాల్లో ఒకటిగా న్యూయార్క్ నగర అగ్నిమాపక కమిషనర్ పేర్కొన్నారు.ఈ అగ్నిప్రమాదాన్ని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సీనియర్ సలహాదారు స్టీఫన్ రింగెల్ ధృవీకరించారు.ఈ అగ్నిప్రమాదంలో మరో 60 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని రెంగెల్ చెప్పారు. అగ్నిప్రమాదం వల్ల వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు మరణించారని అగ్నిమాపక శాఖ కమిషనర్ డేనియల్ నిగ్రో చెప్పారు. తూర్పు 181వ వీధిలోని 19-అంతస్తుల భవనం అయిన బ్రోంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్స్‌లో చెలరేగిన మంటలను ఆర్పడానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి