తొమ్మిది నెలలకే..అప్రతిష్టపాలు

ABN , First Publish Date - 2020-02-20T09:04:34+05:30 IST

తొమ్మిది నెలలకే ప్రజావ్యతిరేఖ కార్యక్రమాలతో అప్రతిష్టపాలైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని

తొమ్మిది నెలలకే..అప్రతిష్టపాలు

వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన కుంభకోణాలు, మాఫియా

టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలలో  నాయకులు


తునిరూరల్‌, ఫిబ్రవరి 19: తొమ్మిది నెలలకే ప్రజావ్యతిరేఖ కార్యక్రమాలతో అప్రతిష్టపాలైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని శాసనమండలి ప్రతి పక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తునిలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన తుని నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుంభకోణాలు, మాఫీ యాలు రాజ్యమేలుతున్నాయన్నారు. మూడు రాజధానులు ప్రజలు కోరుకోలేదన్నారు. ముఖ్యమంత్రితోపాటుగా ఆయన అనుచరుల ఆస్తులు పెంచుకోవడం కోసమే రాజఽధానుల అంశాన్ని తెరపైకి తీసుకొ చ్చారన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తారని విశాఖవాసులు భయానికి గురువుతున్నా రన్నారు. కార్యక్రమంలో మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, దత్తుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ యనమల కృష్ణుడు, యనమల శివరామ కృష్ణన్‌, సుర్ల లోవరాజు, గాడి రాజుబాబు, కోడా వెంకటరమణ తదితరులున్నారు.


వైసీపీ ప్రభుత్వంలో పేట్రేగిన మాఫియా

తుని: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో మాఫియా పెరిగిపోయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు తుని పట్టణంలో ప్రజాచైతన్య యాత్రలను బుధవారం ప్రారంభించారు. ముందుగా తుని పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 28, 29, 30 వార్డుల్లో మోటారు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం సాయి వేదికలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.


నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకునే తుగ్లక్‌ నిర్ణయాలకు రాష్ట్రంలో అశాంతి నెలకొందన్నారు. అధికారం వచ్చిన 9 నెలల్లో ప్రజలతో ఛీ కొట్టించుకున్న ప్రభుత్వం దేశంలోనే వైసీపీ తప్ప మరేపార్టీ కూడా లేదన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి యనవల శివరామకృష్ణన్‌, సీనియర్‌ నాయకుడు బెండపూడి దత్తుడులు, తుని, తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు నడిగట్ల సూరిబాబు, కోడా వెంకట రమణ, గాడి రాజుబాబు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్‌ కరపా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:04:34+05:30 IST