11 రోజుల్లో 6 ఏనుగుల మృతి..9 మంది ఐఎఫ్ఎస్ అధికారులపై బదిలీవేటు

ABN , First Publish Date - 2020-06-20T15:52:04+05:30 IST

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా తీసుకున్న సర్కారు 9మంది అటవీశాఖ ఉన్నతాధికారులపై బదిలీవేటు వేసింది....

11 రోజుల్లో 6 ఏనుగుల మృతి..9 మంది ఐఎఫ్ఎస్ అధికారులపై బదిలీవేటు

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా తీసుకున్న సర్కారు 9మంది అటవీశాఖ ఉన్నతాధికారులపై బదిలీవేటు వేసింది. బలరాంపూర్, ధర్మజాయ్ ఘడ్, సూరజ్ పూర్, బలరాంపూర్,ధాంతరి, రాయగడ్ జిల్లాల్లోని అడవుల్లో కేవలం 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించాయి. దీంతో ఆగ్రహించిన చత్తీస్‌ఘడ్ రాష్ట్ర సర్కారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరుతోపాటు 8మంది ఐఎఫ్ఎస్ అధికారులైన డీఎఫ్‌వోలపై బదిలీ వేటు వేసింది. ఏనుగుల మృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరు అతుల్ కుమార్ శుక్లాను వాతావరణ పరిశోధనా సంస్థ పీసీసీఎఫ్ గా బదిలీ చేసింది. రాయపూర్ రాష్ట్ర అటవీ పరిశోధనశిక్షణ సంస్థ డైరెక్టరుగా పనిచేస్తున్న పీవీనర్సింగ్ రావును వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ గా నియమించింది. 

Updated Date - 2020-06-20T15:52:04+05:30 IST