నవ ఉపవాసాలు

ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST

నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసాలు చేసేవారు ఎంతో మంది! ఉపవాసం

నవ ఉపవాసాలు

నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసాలు చేసేవారు ఎంతో మంది! ఉపవాసం చేయటం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి.. శరీర వ్యవస్థలన్నీ పునరుత్తేజం పొందుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఉపవాసాల వల్ల శక్తిని కోల్పోయే అవకాశముందని కొందరు భావిస్తారు. వాస్తవానికి ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు శరీర జీవక్రియలకు అవసరమైన పోషకాలన్నీ పొందే వీలుండదు. దాంతో తలనొప్పి, ఒళ్లునొప్పులు నీరసం, కళ్లు తిరగడం, మలబద్ధకం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ఈ సమస్యలు రాకుండా ఎలాంటి సమతౌల్యాహారం తీసుకోవాలో సూచిస్తున్నారు  ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌ రాధ. 



నవరాత్రి మెనూ!


1   మొదటి రోజు:  ఉదయం అల్పాహారం: పండ్ల ముక్కలు, అల్పాహారం, భోజనానికీ మధ్య: కొబ్బరినీళ్లు, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని తర్బూజా రసం, పది బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, సాయంత్రం: కలాకండ్‌, రాత్రి భోజనం: పెసర మొలకలు, వాటర్‌ చెస్ట్‌నట్‌ పిండితో తయారుచేసిన రోటీలు, పాలకూర, ఆలూ కూర, అరటికాయ వేపుడు, కూరగాయలతో తయారుచేసుకున్న రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


2  రెండో రోజు:  అల్పాహారం: జామ, యాపిల్‌ ముక్కలు, అల్పాహారం, భోజనానికీ మధ్య: చిక్కని మజ్జిగ, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని యాపిల్‌ రసం, పది బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, సాయంత్రం: కొబ్బరి బర్ఫీ, రాత్రి భోజనం: సగ్గుబియ్యం కిచిడీ, వాటర్‌ చెస్ట్‌నట్‌ పిండితో తయారుచేసిన రోటీలు, మసాలా పన్నీర్‌ కూర, గుమ్మడి కూర, టొమాటో రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


3  మూడో రోజు: అల్పాహారం: తర్బూజా, పైనాపిల్‌ ముక్కలు, అల్పాహారం, భోజనానికీ మధ్య: కొబ్బరినీళ్లు, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని వంకాయ రంగు ద్రాక్ష రసం, పది బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, సాయంత్రం: డ్రైఫ్రూట్‌ లడ్డూ, రాత్రి భోజనం: సామల కిచిడీ, రాగిపిండి రోటీలు, సొరకాయ కూర, ఆలూ వేపుడు, కీరా రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


4 నాలుగో రోజు: అల్పాహారం: రకరకాల పండ్ల ముక్కల సలాడ్‌, అల్పాహారం, భోజనానికీ మధ్య: చిక్కని లస్సీ, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని జామ పండు రసం, పది బాదం పప్పులు, మూడు ఖర్జూరాలు, సాయంత్రం: చెస్ట్‌నట్‌ హల్వా, రాత్రి భోజనం: రాజ్‌గిరా రోటీ, - సగ్గుబియ్యం కిచిడీ, ఫూల్‌మఖ్‌నా, పన్నీర్‌ కూర, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కడీ, పెరుగు, రాత్రి పడుకునే ముందు పాలు.


5 అయిదో రోజు: అల్పాహారం: జామ, అరటిపండు, అల్పాహారం, భోజనానికీ మధ్య: కొబ్బరినీళ్లు, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని పుచ్చ రసం, పది బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, సాయంత్రం: బాదం బర్ఫీ, రాత్రి భోజనం: రాగి దోశ, కొర్రల దాలియా, టొమాటో చట్నీ, - గుమ్మడికాయ కూర, కీరా రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


6 ఆరో రోజు: అల్పాహారం: యాపిల్‌, బొప్పాయి, అల్పాహారం, భోజనానికీ మధ్య: నిమ్మరసం, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని బత్తాయి రసం, పది బాదం పప్పులు, నాలుగు ఖర్జూరాలు, సాయంత్రం: బక్‌వీట్‌ హల్వా, రాత్రి భోజనం: సామల పులావ్‌, సగ్గుబియ్యం కిచిడీ, పాలక్‌ పన్నీర్‌, కొలొకేషియా ఫ్రై, క్యారెట్‌ రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


7 ఏడో రోజు: అల్పాహారం: మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ చాట్‌, అల్పాహారం, భోజనానికీ మధ్య: కొబ్బరినీళ్లు, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని పైనాపిల్‌ రసం, పది బాదం పప్పులు, నాలుగు ఖర్జూరాలు, సాయంత్రం: నట్స్‌ లడ్డూ, రాత్రి భోజనం: బక్‌వీట్‌తో చేసిన పరోటా, సగ్గుబియ్యం కిచిడీ, మసాలా ఫూల్‌ మఖ్‌నా కర్రీ, అరటికాయ వేపుడు, తీపి, పులుపు రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


8 ఎనిమిదో రోజు: అల్పాహారం: పనస, దానిమ్మ, అల్పాహారం, భోజనానికీ మధ్య: పిస్తా లస్సీ, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని నారింజ, లేదా మాల్టా రసం, పది బాదం పప్పులు, మూడు ఖర్జూరాలు, సాయంత్రం: మఖ్‌నా పాయసం, రాత్రి భోజనం: రాజ్‌గిరా పరోటా, సామల దాలియా, ఆలూ వేపుడు, సొరకాయ కడీ, పెరుగు, రాత్రి పడుకునే ముందు పాలు.




9 తొమ్మిదో రోజు: అల్పాహారం: పుచ్చ, పైనాపిల్‌, అల్పాహారం, భోజనానికీ మధ్య: కొబ్బరినీళ్లు, మధ్యాహ్న భోజనం: చక్కెర కలపని దానిమ్మ రసం, పది బాదం పప్పులు, మూడు ఖర్జూరాలు, సాయంత్రం: రాజ్‌గిరా లడ్డు, రాత్రి భోజనం: బక్‌వీట్‌ పూరీ, సగ్గుబియ్యం కిచిడీ, పన్నీర్‌ బటర్‌ మసాలా, చింతపండుతో వండిన చిలకడదుంప కూర, కొత్తిమీర రైతా, రాత్రి పడుకునే ముందు పాలు.


(తోటకూర విత్తనాలు, వాటర్‌ చెస్ట్‌నట్‌, బక్‌వీట్‌ అందుబాటులో లేనివాళ్లు, వాటికి ప్రత్యామ్నాయంగా సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికలను వాడుకోవచ్చు)


 డాక్టర్‌ రాధా రెడ్డి చాడ

చీఫ్‌ క్లినికల్‌ డైటీషియన్‌,

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

9849423806


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST