భూమిపూజకు వాడిన ఇటుకలు 9

ABN , First Publish Date - 2020-08-05T22:25:20+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజ ..

భూమిపూజకు వాడిన ఇటుకలు 9

అయోధ్య: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజ పూర్తయింది. భూమిపూజా ప్రాంతంలో ప్రధాని తొమ్మది ఇటుకలు ఉంచారు. తొమ్మిది సంఖ్య ప్రాధాన్యతపై ఆలయ పూజారి ఒకరు మాట్లాడుతూ, నిర్మాణ ప్రక్రియ మొదలైందని చెప్పడానికి ఇది సంకేతమని చెప్పారు.


'తొమ్మిది ఇటుకలు ఇక్కడ ఉంచడం జరిగింది. 1989లో ప్రపంచవ్యాప్తంగా రాముడి భక్తులు వీటిని పంపారు. ఇలాంటి ఇటుకలు 2,75,000 వరకూ ఉన్నాయి. వీటిలో జై శ్రీరామ్ అని చెక్కిన 100 ఇటుకలు భూమి పూజకోసం తీయడం జరిగింది' అని పూజారి వివరించారు. భూమి పూజా కార్యక్రమం, ఇతర శుద్ధి కార్యక్రమాల కోసం సుమారు 2,000 యాత్రాస్థలాల నుంచి సేకరించిన మట్టి, 100 పవిత్ర నదుల నుంచి సమీకరించిన జలాలను ఉపయోగించారు. ఆలయ ఫలకంతో పాటు, 'శ్రీ రామ్ జన్మభూమి మందిర్' స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Updated Date - 2020-08-05T22:25:20+05:30 IST