గండికోటలో గొడవ - తొమ్మిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T04:53:40+05:30 IST

పర్యాటక ప్రాంతమైన గండికోటలో గురువారం రాత్రి గొడవ చోటు చేసుకుంది.

గండికోటలో గొడవ - తొమ్మిది మంది అరెస్టు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 15: పర్యాటక ప్రాంతమైన గండికోటలో గురువారం రాత్రి గొడవ చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గండికోటలోని టెంట్లలో హైదరాబాదు, నంద్యాలకు చెందిన రాజశేఖర్‌, అతని వర్గీయులు మరో నలుగురు, పవన, మరో అయిదుగురు గొడవ పడ్డారు.

రాత్రి సమయంలో మద్యంతాగి మాటా మాటా పెరడంతో గొడవకు దారీతీసింది. సమాచారం తెలుసుకున్న జమ్మలమడుగు అర్బన పోలీసులు ఘటనా స్థలం చేరుకుని ఇరువర్గీయులను విచారిస్తున్నట్లు అర్బన సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో గొడవ జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనా గండికోట పర్యాటక ప్రాంతంలో ప్ర తి శని, ఆదివారాల్లో అనధికారికంగా టెంట్లు వే స్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

Updated Date - 2021-01-16T04:53:40+05:30 IST