నిండు శోకంతో మొహర్రం

ABN , First Publish Date - 2022-08-10T06:51:46+05:30 IST

ద్రాక్షారామలో మొహర్రంను ముస్లింలు నిండుశోకంతో జరుపుకున్నారు. ద్రాక్షారామలో ప్రపంచ ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్‌ ప్రవక్త మనుమడు హజరత్‌ ఇమాం హుస్సేన్‌ సంతాప దినాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి.

నిండు శోకంతో మొహర్రం

ముగిసిన హజరత్‌ ఇమాం హుస్సేన్‌ సంతాప దినాలు 

ద్రాక్షారామ, ఆగస్టు 9: ద్రాక్షారామలో మొహర్రంను ముస్లింలు నిండుశోకంతో జరుపుకున్నారు. ద్రాక్షారామలో ప్రపంచ ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్‌ ప్రవక్త మనుమడు హజరత్‌ ఇమాం హుస్సేన్‌ సంతాప దినాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ఇమాం హుస్సేన్‌ త్యాగానికి చిహ్నంగా మా తం, మజిలిస్‌లు నిండు శోకంతో జరుపుకున్నారు. సోమవారం రాత్రి ఆగావారి పెద్ద పంజా నుంచి బార్‌మె ఇమాం(తల్లిపీరి) ఊరేగింపు మాతంతో జరిగింది. ఇమాం హుస్సేన్‌ వీరమరణం పొందిన రోజు మంగళవారం ప్రత్యేక నమాజు జరిగింది. పెద్ద మసీదు సెంటర్‌ నుంచి హజరత్‌ అబ్బాస్‌ రోడ్డు వరకు ఆయా పంజాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ రక్తం చిందేలా గాయపరుచుకుని ఇమాం హుస్సేన్‌పై భక్తిని చాటుకున్నారు. మొక్కుబడులు సమర్పించుకున్నారు. పీరులు, గుమ్మటాలను చెరువుల వద్దకు తీసుకువెళ్లి కడిగి శాంతింప చేశారు. ఉత్తర ప్రదేశ్‌నుంచి వచ్చిన మత ప్రభోధకులు మౌలాన మహమ్మద్‌ షంసి మజ్లీస్‌ బోధించారు. పంజా ముజావర్లు భోజన  వసతి సౌకర్యాలు కల్పించారు. 

గుండెలు బాదుకుంటూ షహదత్‌

ముమ్మిడివరం: మొహర్రం నెల సంతాపదినాల్లో భా గంగా ఇమామ్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులు కర్బలా మైదానంలో వీరమరణం చెందిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ముమ్మిడివరంలో మసీదువీధి వద్ద  ఉన్న బీబీ జైనబ్‌ పంజా వద్ద ముస్లింలు భక్తిశ్రద్ధలతో షహదత్‌ నిర్వహించారు. తమ ఆరాధ్యదైవమైన ఇమా మ్‌ హుస్సేన్‌కు గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించి నివాళులర్పించారు. యూపీ నుంచి విచ్చేసిన మౌ లానా జఫర్‌ అబ్బాస్‌ కర్బలా చరిత్రను షియా ముస్లిం లు ఎన్నటికీ మరువలేరన్నారు. ప్రత్యేక నమాజులను నిర్వహించి రక్తాలు చిందేలా హుస్సేన్‌.. హుస్సేన్‌ అంటూ గుండెలు బాదుకుంటూ జోరున కురుస్తున్న వర్షంలోను మాతం నిర్వహిస్తూ పురవీధుల్లో పీర్లను ఊరేగించారు. 

కపిలేశ్వరపురం: మండలంలోని పలు గ్రామాల్లో మొ హర్రంను ముస్లిం సోదరులు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగర మస్‌జిద్‌ -ఎ- ఇబ్రహీమలో నిర్వహించిన కార్యక్రమంలో మస్‌జద్‌-ఎ-ఇబ్రహిమ ముతవల్లీ మహ్మద్‌ అబ్బాస్‌ హుస్సేన్‌ ఆధ్వర్యం లో మసీద్‌ ఇమామ్‌ మహ్మద్‌ నాజీం అక్తర్‌ మొహర్రం ప్రాముఖ్యతను వివరించారు. 

చెయ్యేరులో పీర్ల ఊరేగింపు

కాట్రేనికోన: మొహర్రం సంతాప దినాలు పాటిస్తున్న షియా ముస్లింలు మంగళవారం పీర్ల పంజాలలో పీర్లను ఊరేగించి శాంతింపజేశారు. చెయ్యేరు అలీనగర్‌ పంజాలలో గత పదిరోజులుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేశారు. మసీదు కమిటీ చైర్మన్‌ రోషన్‌ అబ్బాస్‌, కార్యదర్శి హుస్సేన్‌ పాల్గొన్నారు.

యానాం: యానాంలో మొహర్రం పర్వదినం ప్రారంభమైన సందర్భంగా యానాంలోని పీర్ల పంజాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఉత్సవాలలో భాగంగా మంగళవారం పీర్‌పంజ వద్ద నుంచి గుమ్మటం పీర్ల ఊరేగింపును నిర్వహించారు. పలువురు భక్తులు పోర్లు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

అంబాజీపేట: త్యాగానికి ప్రతీక మొహరంను ముస్లిం లు భక్తిశ్రద్ధలతో మంగళవారం జరుపుకున్నారు. అంబా జీపేట పెద్దవీధిలోని ఉన్న మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత దివంగతులైన పెద్దల ఆత్మకు శాంతి జరగాలని దువ్వా చేశారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, కరీముల్లా, ఇస్మాయిల్‌, ఆరీఫ్‌ పాల్గొన్నారు. 

అల్లవరం: స్థానిక పీర్ల పంజావద్ద మొహర్రం సంతా ప ప్రార్థనలు జరిగాయి. అల్లవరం పీర్ల పంజా నుంచి పవిత్ర పీరును బయటకు తీసి ఊరేగించారు. ముజావర్ణి షేక్‌ గౌసియా, ముజావర్‌ మొల్లాజానీ, రహమాన్‌, ఖాజా, జహంగీర్‌, ఇర్ఫాన్‌, వలీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:51:46+05:30 IST