కొవిడ్‌ చిన్నారుల వైద్య ఖర్చులకు రూ. 4.25 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-06-06T10:51:04+05:30 IST

కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారుల వైద్య ఖర్చుల నిమిత్తం ఓ చిన్నారి తనవంతు సాయంగా రూ. 4.25 లక్షల విరాళం

కొవిడ్‌ చిన్నారుల వైద్య ఖర్చులకు రూ. 4.25 లక్షల విరాళం

పంజాగుట్ట, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారుల వైద్య ఖర్చుల నిమిత్తం ఓ చిన్నారి తనవంతు సాయంగా రూ. 4.25 లక్షల విరాళం అందజేసింది. పంజాగుట్టలోని లిటిల్‌ స్టార్స్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూబ్లీహిల్స్‌కు చెందిన చిన్నారి ఆద్యాపోల్సాని తాను సేకరించిన రూ. 4.25 లక్షల విరాళం చెక్కులను ఛాయిస్‌ ఫౌండేషన్‌ ప్రతినిదులు డాక్టర్‌ సతీష్‌, నిర్మాత శోభు యార్లగడ్డకు తల్లిదండ్రులతో కలిసి అందజేసింది.


ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ.. తాత వేణుగోపాల్‌ సహకారంతో 62 మందికి ఫోన్‌ చేసి చిన్నారుల వైద్య చికిత్స కోసం విరాళాలు సేకరించినట్టు చెప్పింది. పది రోజుల్లో ఈ డబ్బు సేకరించినట్లు తెలిపింది. తమ ఆస్పత్రిలో తొమ్మిదిమంది చిన్నారుల చికిత్స నిమిత్తం ఇప్పటికే 12 దేశాలు, 62 నగరాలకు చెందిన 330 మంది నుంచి కొంతమంది చిన్నారులు స్వచ్ఛందంగా రూ. 24 లక్షల విరాళం సేకరించినట్టు డాక్టర్‌ సతీష్‌ తెలిపారు. కార్యక్రమంలో మాధవి, ఆద్యా తల్లిదండ్రులు రుచి, సందీప్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:51:04+05:30 IST