కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు!

ABN , First Publish Date - 2021-05-06T14:23:23+05:30 IST

కరోనాతోపాటు గుండె వైఫల్యం చెందే దశలో ఉన్న నిండు గర్భిణి/..

కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు!

హైదరాబాద్/రాంగోపాల్‌ పేట్‌ : కరోనాతోపాటు గుండె వైఫల్యం చెందే దశలో ఉన్న నిండు గర్భిణి(28), ఆమెకు పుట్టిన బిడ్డకు కృత్రిమ శ్వాసనందించి ఇద్దరి ప్రాణాలను కిమ్స్‌ వైద్యులు కాపాడారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన హైదరాబాద్‌కు చెందిన నిండు గర్భిణి(28)ని పరీక్షించిన వైద్యులు ఆమె గుండె ఆగిపోయే  స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ముందస్తు చికిత్స ప్రారంభించే ప్రయత్నం చేసినప్పటికీ కడుపులోని పిండాన్ని కూడా ప్రమాదంలో పడేసింది. క్లిష్టమైన ఈ కేసులో త్రీడీ మ్యాపింగ్‌ ద్వారా గుండె సమస్యను నియంత్రించారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, ఎలక్ర్టోఫిజియాలజీ డివిజన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.హయగ్రీవ రావు, ప్రసూతి వైద్యురాలు వసుంధర నేతృత్వంలో సిజేరియన్‌ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.

Updated Date - 2021-05-06T14:23:23+05:30 IST