జగన్ గాలిలో ఇస్తున్న హామీలు..గాలిలోనే కలిసిపోతున్నాయి: నిమ్మల

ABN , First Publish Date - 2020-11-29T19:19:30+05:30 IST

పాలకొల్లు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం పర్యటిస్తున్నారు.

జగన్ గాలిలో ఇస్తున్న హామీలు..గాలిలోనే కలిసిపోతున్నాయి: నిమ్మల

ప.గో. జిల్లా: పాలకొల్లు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం పర్యటిస్తున్నారు. ఆగర్రు, ఆగర్తిపాలెం, వెలివెలలో నివర్ తుపాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గాలిలో ఇస్తున్న హామీలు.. గాలిలోనే కలిసిపోతున్నాయని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంపై.. అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రభుత్వం రైతులకు ఒక్క సాయం కూడా చేయలేదని ఆరోపించారు. అన్నదాతకు ఇచ్చే సాయం తక్కువ...సొంత అవినీతి మీడియాకు ఇచ్చే ప్రకటనల ఖర్చు ఎక్కువని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-11-29T19:19:30+05:30 IST