Abn logo
Aug 14 2020 @ 15:56PM

డీజీపీకి చినరాజప్ప లేఖ

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మాజీ హోంమంత్రి  చినరాజప్ప లేఖ రాశారు. టీడీపీ కార్యకర్తలను కట్టడి చేయగలిగిన పోలీసులు.. వైసీపీ గూండాల అరాచకాలను ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణని కించపర్చిన మంత్రి పెద్దిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. దళిత యువకుడు వరప్రసాద్‌ శిరోముండనానికి బాధ్యుడైన.. వైసీపీ నేత కృష్ణమూర్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. విక్రమ్‌ హత్యకు ప్రేరేపించిన గురజాల ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టలేదన్నారు. గుంటూరు-1 ఎమ్మెల్యేకి చెందిన షెడ్డులో మంగళగిరి ఎమ్మెల్యే బంధువులు.. గుట్కా తయారీ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని చినరాజప్ప ప్రశ్నించారు.


Advertisement
Advertisement
Advertisement