Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు భేఖాతర్

విజయవాడ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను పోలీసులు భేఖాతరు చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లొచ్చని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పోన్లు తీసుకుని ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లను పోలీసులు ఇబ్బందిపెడుతున్నారు. సెల్‌పోన్లతో ఓటు వేయడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ల కోసం సేప్టి లాకర్లు ఏర్పాటు చేయకుండా ఉదయం నుంచి తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు విలువ గురించి ప్రజల్లో చైతన్యాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.


ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు తీసుకువెళ్తున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకుండానే వెనుదిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లొచ్చని  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement