హైకోర్టు కీలక తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2021-01-21T17:19:00+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం విదితమే.

హైకోర్టు కీలక తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ రియాక్షన్ ఇదీ..

ఏలూరు/అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం విదితమే. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన ధర్మాసనం.. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు.


4 దశల్లో నిర్వహిస్తాం..!

హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం?. ఎన్నికలకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తాంఅని ఎస్‌ఈసీ రమేష్‌ మీడియాకు వెల్లడించారు. గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరగంట సేపు ఆయన ధ్యానం చేశారు. అనంతరం హైకోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


వాట్ నెక్ట్స్!?

కాగా ఈ తీర్పుపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ స్వాగతించారు. మరోవైపు.. హైకోర్టు తాజా తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పరిస్థితులకు ఇవాళ్టితో ఫుల్‌స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు!.

Updated Date - 2021-01-21T17:19:00+05:30 IST