నందివాడలో ట్రాన్స్‌కో అధికారుల నిలదీత

ABN , First Publish Date - 2021-10-29T05:23:31+05:30 IST

మండలంలోని నందివాడ గ్రామంలో గురువారం గ్రామస్థులు ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు.

నందివాడలో ట్రాన్స్‌కో అధికారుల నిలదీత
నందివాడలో ఏఈ, ఏడీఈలను నిలదీస్తున్న గ్రామస్థులు

తాడ్వాయి, అక్టోబరు 28: మండలంలోని నందివాడ గ్రామంలో గురువారం గ్రామస్థులు ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. ఇంటి కరెంట్‌ బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయని అధికారులపై మండిపడ్డారు. ఒక ఇంటికి 188 యూనిట్ల కరెంట్‌ వాడుకుంటే రూ.1746 బిల్లు రావడం ఏమిటని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లుల వసూలు కోసం వచ్చిన ఏఈ కర్ణాకర్‌, ఏడీఈ మల్లేశంలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కరెంట్‌ వాడుకోకున్నా అధిక బిల్లు రావడం ఏమిటని వారు మండిపడ్డారు. బిల్లు సంగతి తేల్చే వరకు కరెంటు బిల్లులు కట్టమని భీష్మించుకుకూర్చున్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈని వివరణ కోరగా శుక్రవా రం గ్రామానికి ఈఆర్‌వో అధికారులను రప్పిస్తామని తెలిపారు. కరెంటు బిల్లులు ఎక్కువ రావడంపై తమకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపారు.

Updated Date - 2021-10-29T05:23:31+05:30 IST