Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గడప గడపలో నిలదీత

twitter-iconwatsapp-iconfb-icon
గడప గడపలో నిలదీతముందు రోడ్డు వేసి.. ఓటు అడుగ ంటూ ఎమ్మెల్యేను నిలదీస్తున్న వృద్ధురాలు శేకమ్మ

  1. తప్పించుకొని తిరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు  
  2. అధికారుల సాక్షిగా ఓటు అభ్యర్థన 
  3. జగనకు ఓటేయకుంటే
  4.  సంక్షేమ పథకాలు రద్దని బెదిరింపు  


‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో  అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఎక్కడికక్కడే చుక్కెదురవుతోంది. మంగళవారం ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు గ్రామాల్లో ప్రజలు సమస్యలపై నిలదీశారు. 


 ఆదోని రూరల్‌, మే 24: ‘గడప గడపకూ  మన ప్రభుత్వం’ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డిపై ఎక్కడికక్కడే ప్రశ్నల వర్షం కురుస్తోంది. మంగళవారం ప్రభుత్వ  అధికారుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి గడప గడపకూవెళ్లి జగనకు ఓటేయాలని... లేకుంటే  సంక్షేమ పథకాలు రావని బాహాటంగానే చెప్పారు. దీంతో  ఆదోని మండలం దిబ్బనకల్లుకు చెందిన 85ఏళ్ల శేకమ్మ, లక్ష్మి, లక్ష్మమ్మ, చాకలి వీరే్‌ష తదితరులు మాట్లాడుతూ ముందు తమ ఊళ్లో రోడ్డు వేశాక ఓట్ల కోసం రమ్మని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో అన్నారు. వీధులు బురదమయంగా ఉన్నాయని, వీధి లైట్లు లేక. చీకట్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 చంద్రబాబు హయాంలో ఫించన వ చ్చేది :  ‘రెడ్డీ...  మీరు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి నాకు పింఛన రావడం లేదు.... నాకు జీవనాధారం పింఛనే. చంద్రబాబు యాంలో వచ్చేది’ అని గ్రామానికి చెందిన ఈరమ్మ  ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని దీనంగా అడిగింది. ఈరమ్మ చంద్రబాబు పేరు ఎత్తగానే ఎమ్మెల్యే స్పం దిస్తూ...‘ఈమెకు ముసలోళ్ల పింఛన రాయండ’ని అధికారులతో అంటూ ముందుకు కదిలారు.

 అమ్మఒడి రావడం లేదు 

‘రెడ్డీ నాకు ఐదుమంది ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు మాది నిరుపేద కుటుంబం. ప్రస్తుతం నా నలుగురు బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఒక్కరికీ అమ్మఒడి రాలేదు. సచివాలయం చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చింది. వలంటీర్లను అడిగి అడిగి సాలైంది. బాగా ఉన్న వాళ్ల పిల్లలకు అమ్మఒడి పడింది. మాకు మాత్రం పడలేదు రెడీ’్డ అంటూ గ్రామానికి చెందిన పార్వతి... ఎమ్మెల్యేకు తన గోడును చెప్పుకొంది. ‘అమ్మా మీకు రైతు భరోసా పడింది కదా’ అంటూ ఆయన అక్కడి నుంచి చిత్తగించారు. కొంతమంది మహిళలు ఎమ్మెల్యేను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఊరంతా తిరిగావ్‌ కదా రెడ్డీ... దుర్వాసన రాలేదా?’ అని ప్రశ్నించారు. రోడ్లు లేవు, కాల్వలు లేవు. తాగునీరు దొరకడం లేదు. రాత్రి వేళలో చీకట్లో తిరగలేం. మా గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ మూకమ్మ, ఆళ్లమ్మ, ఈరమ్మ, నాగమ్మ, లింగమ్మ, మల్లమ్మలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఏం చేయాలో తోచక ఎమ్మెల్యే అధికారులను పిలిచి... ‘88‘వీరి సమస్యలను పరిష్కరించండంటూ’ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి? 

ఎమ్మిగనూరు, మే 24: ‘అర్బన హెల్త్‌ సెంటర్‌లో 15ఏళ్లు పనిచేశాం. గతేడాది ఆగస్టులో ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా మమ్మల్ని తొలగించారు. భార్యాభర్తలకు ఇద్దరికీ ఉద్యోగాలు లేవు ..రోడ్డున పడ్డాం. ఎలా బతకాలి..  మా బాధను మీకు కాక ఎవరికి చెప్పుకోవాలి..’ అని కళావతి అనే ఏఎనఎం గడపగడపకు కార్యక్రమంలో భాగంగా తమ ఇంటివద్దకు వచ్చిన నాయకులను, అధికారులను ప్రశ్నించింది. ఈ విషయం  ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని వారు ముందుకు వెళ్లారు. మంగళవారం పట్టణంలోని మూడోవార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు జగన్మోహనరెడ్డి, మున్సిపల్‌ చైర్మన డా.రఘు, వైస్‌చైర్మన నజీర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో పలువురు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వడ్డీ డబ్బులు జమకాలేదని...  పింఛను రావటం లేదని... మినీ ట్యాంకు నుంచి నీరు ఓవర్‌ ఫ్లో అవుతోందని మహిళలు సమస్యలు ఏకరువు పెట్టారు. తరువాత గోపాల్‌ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ తమకు అమ్మఒడి రాలేదని... ఎన్నిసార్లు సచివాలయం చుట్టు తిరిగినా.. ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్ణి కార్పొరేషన చైర్మన బుట్టా శారదమ్మ, అఽధికారులు వెంకటేశ్వర్లు, మోహన, ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగళ్లి స్వాతి, కేశవరెడ్డి, చంద్రమోహానరెడ్డి, ఇసాక్‌, వాహిద్‌ పాల్గొన్నారు.  

బిల్లులు ఇస్తారా? లేదా?

కోడుమూరు, మే 24: ‘సారూ.. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఇళ్లు మంజూరు చేసింది. రూ.50వేలు బిల్లు కూడా వేసింది. రూ.4లక్షలు అప్పు చేసి ఇంటిని నిర్మించుకున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక  ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదు. ఇంతకూ బిల్లులు ఇస్తారా...? లేదా...’ అంటూ సుంకులమ్మ అనే మహిళ కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను నిలదీసింది. కోడుమూరు పట్టణంలో మంగళ వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడుగడుగునా మహిళలు సమస్యలను ఏకరవు పెట్టారు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేను అడ్డగించారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేస్తే ఇల్లు  నిర్మించుకు నేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రత్నమ్మ, గిడ్డయ్య మరో 30 మంది ఎమ్మెల్యేను వేడుకున్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పించండి : 8నెలల కిందట  తలకు రూ.3.50 లక్షలు అప్పు చేసి హైదరాబాదులోని నిమ్స్‌ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకొన్నాను. మొదట సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వస్తుందని మీ పీఏ అన్నారు. ఆ తర్వాత రాదని అన్నారని సుధాకర్‌ అనే వ్యక్తి ఎమ్మెల్యేతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే  కర్నూలులోని తన ఆఫీసుకు వచ్చి కలవాలని సూచించారు. 

 జగనన్న విద్యా దీవెన ఎలా వస్తుంది? : ‘మా ఇంట్లో కాలేజీకి ఎవ్వరూ వెళ్లడం లేదు. అట్లాంటిది జగనన్న విద్యా దీవెన డబ్బు వస్తున్నద’ని మరియమ్మ కుమారుడు అడ్వకేట్‌ రాజు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎవరి ఖాతాలోనికో వెళ్లాల్సిన  నగదు తమ ఖాతాలోకి వస్తోందని ఆయన ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇలాంటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడమేంటని మరియమ్మ కుటుంబ సభ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం కొసమెరుపు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.