Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 13:14:20 IST

Nikhil: ప్రభాస్ భాయ్ థాంక్యూ..

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas)కి థాంక్స్ చెప్పారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన కార్తికేయ 2 (Karthikeya 2) గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకి సౌత్ భాషలతో పాటు నార్త్‌లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుసగా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. 

ఇక ఈ సినిమా సక్సెస్ పట్ల పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ప్రభాస్ కూడా తన ఇన్స్టా స్టోరీలో కార్తికేయ 2 చిత్రబృందానికి కంగ్రాట్స్ చెబుతూ టీమ్ పోస్టర్‌ను పెట్టుకున్నారు. దీనికి హీరో నిఖిల్ తన ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పారు. ఈ మేరకు పోస్ట్ పెట్టిన నిఖిల్ అందులో "ప్రభాస్ భాయ్ మీ విషెస్‌కి ధన్యవాదములు. మీ మెసేజ్‌తో కార్తికేయ టీమ్ ఎంతో సంతోషపడింది".. అని పేర్కొన్నారు. 

Nikhil: ప్రభాస్ భాయ్ థాంక్యూ..

కాగా, నిఖిల్ - దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది కార్తికేయ 2. ఇదే సినిమాకు పోటీగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, బాలీవుడ్ చిత్రాలు లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ దిగాయి. అయితే, బింబిసార హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా, హిందీ చిత్రాలు మాత్రం చతికిల పడ్డాయి. దాంతో కార్తికేయ 2 హిందీలో సత్తా చాటుతూ మంచి వసూళ్ళు రాబడుతోంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement