హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్న నిఖిల్ - సుధీర్ వర్మ..!

యంగ్ హీరో నిఖిల్ - యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. 2013లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా 'స్వామి రారా'. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో 'కేశవ' అనే సినిమా వచ్చి కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మూడవసారి హ్యాట్రిక్ హిట్‌ కొట్టేందుకు నిఖిల్ - యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియన్ కన్‌ఫర్మేషన్ కూడా వచ్చింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మించనున్నారు. దసరా సందర్భంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా విషయాలను త్వరలో వెల్లడించనున్నారు. కాగా ప్రస్తుతం నిఖిల్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్', చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement