Womens World Boxing Championships: తెలంగాణ యువతి నిఖత్ జరీన్ సంచలనం

ABN , First Publish Date - 2022-05-19T00:28:33+05:30 IST

ఇస్తాంబుల్ : నిజామాబాద్ యువతి, 25 ఏళ్ల వర్ధమాన ఇండియన్ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పెనుసంచలనం సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్

Womens World Boxing Championships: తెలంగాణ యువతి నిఖత్ జరీన్ సంచలనం

ఇస్తాంబుల్ : నిజామాబాద్ యువతి, 25 ఏళ్ల వర్ధమాన ఇండియన్ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పెనుసంచలనం సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 52 కేజీల కేటగిరిలో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డే అల్మెడాను 5-0 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై అన్ని బౌట్లలోనూ ఆధిపత్యం చెలాయించింది. అద్భుతమైన విజయంతో గట్టి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. 2022లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా జరీన్ నిలిచింది. కాగా ఇదివరకు మేరీ కోమ్, సరితా దేవీ, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా సీ వంటి భారతీయ మహిళా బాక్సర్ల ప్రపంచ స్థాయి టైటిల్స్ గెలిచారు. ఇప్పుడు వీరి సరసన చోటుదక్కించుకునేందుకు నిఖత్ జరీన్‌కు అవకాశం ఏర్పడింది. రేపు గురువారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. మాజీ యూత్ వరల్డ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లో గోల్డ్ దక్కించుకుని అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-19T00:28:33+05:30 IST