నిజాంసాగర్‌ మూడు గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-20T04:41:27+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 24,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

నిజాంసాగర్‌ మూడు గేట్ల ఎత్తివేత
గేట్ల ద్వారా దిగువకు వెళుతున్న వరద నీరు

24,800 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల
నిజాంసాగర్‌, అక్టోబరు 19: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 24,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి వీయార్‌ నెంబర్‌ 5లోని 3, 6, 7 గేట్లను ఎత్తి 24 వేల 800 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1405 అడుగులకు గాను 1404.90 అడుగుల నీటి సామర్థ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం 17.608 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో రెవెన్యూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారు.

Updated Date - 2021-10-20T04:41:27+05:30 IST