మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి సందడి ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో నాగబాబు కుమార్తె నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెల 9వ తేదీ రాత్రి 7:15 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో ఈ పెళ్లి జరుగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి.
తమ కుటుంబంలోకి చైతన్యను ఆహ్వానిస్తూ మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్ మాత్రం హాజరుకాలేదు.